TRINETHRAM NEWS

బరులను ధ్వంసం చేసిన పోలీసులు

జూద క్రీడలకు దూరంగా ఉండాలి. సిఐ అభిబ్ బాషా

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను గ్రామంలో సంక్రాంతి పర్వదినాల్లో సంప్రదాయం ముసుగులో పేకాట, కోడిపందాలు, గుండాట తదితర జూద క్రీడలు ఆడితే కఠిన చర్యలు తప్పవని సిఐ అబిబ్ భాషా హెచ్చరించారు.

యువత పక్కదారి పట్టకుండా ఉండేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు కృత్తివెన్ను గ్రామంలో బరులకు సిద్ధం చేస్తున్నారన్న సమాచారంతో బరులను ధ్వంసం చేయడం జరిగిందని సీఐ తెలిపారు.

సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ క్రీడలను మాత్రమే నిర్వహించాలని అందుకు విరుద్ధంగా ఎవరైనా జూద క్రీడలలు నిర్వహించినా,ఆడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొన బడునని సిఐ అబీబ్ భాషా హెచ్చరించారు.

జూధ క్రీడలకు ఎటువంటి అనుమతులు లేవని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కృత్తివెన్ను ఎస్సై గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.