ఎవరేమన్నా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపును ఆపలేరు.
ప్రజలంతా బీ ఆర్ ఎస్ పార్టీ వైపే …
గిర మోని శ్రీనివాస్
బీ ఆర్ ఎస్ పార్టీ డిండి పట్టణ అధ్యక్షులు.
డిండి (గుండ్ల పల్లి) నవంబర్ 03 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ ఆధ్యక్షులు గిరామోని శ్రీనివాస్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీ ఆర్ ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని , ప్రజలంతా బీ ఆర్ ఎస్ పార్టీ గెలువాలని , మోసపూరిత వాగ్దాన , హామీల పాలన పోయి కేసి ఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.,కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు మాటలు ,వాగ్దానాలు నమ్మేస్థితిలో ప్రజలు లేరనీ
ఓట్లకు ముందే ప్రజలను భయపెడుతున్న సీఎం.- అన్ని పథకాలు ( ఫ్రీకరెంట్, ఫ్రీబస్ , సన్నబియ్యం) బందు ఐతాయని అంటున్నాడు. ప్రజలను భయపెడుతున్నారు వీళ్ళ మాటలు వాగ్దానాలు ప్రజలు నమ్మరనీ అభ్యర్థి గెలవకముందే మీరు గల్లి దాటరు, ఇండ్లకు పోరని అంటే? గెలిచిన తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో ? ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ప్రజలు బీ ఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా ఉన్నారు. గెలుపు కోసం కృషి అంతా ఒక్కతాటిపై వున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు కావస్తున్న ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, ప్రతి మహిళకు 2500 ఇస్తామని, వృద్ధులకు పింఛన్ 4000 ఇస్తామని రైతు భరోసా 15000, ఉపాధి హామీ కూలీలకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12000 అని విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు 23 నెలలుగా ఇవ్వని నిరుద్యోగ భృతి, ఇప్పటివరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వలేదు అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీ లను వాగ్దానాలను గ్యారంటీలను తుంగలో తొక్కి , పాలన గాలికి వదిలేసి , అధికార నాయకులు మంత్రులు ఎం ఎల్ ఏ లు పొద్దున లేస్తే నీకు ఇంత నాకెంత ?అనే వాటాల పంచాయతీ ప్రజలు ప్రజలు గమనిస్తున్నారని , కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీ లు అమలు చేస్తేనే ఓటు వేస్తామని ప్రజలు ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని తెలిపారు, జూబ్లీ హిల్స్ ప్రజలు అంతా బిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని కచ్చితంగా బీ ఆర్ఎస్ పార్టీదే విజయం ఖాయం అని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


