MP DK Aruna : బాధిత రైతులకు భరోసా

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 03 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డికె. అరుణ పర్యటించారు.

మల్లేపల్లి మండలంలోని పలు గ్రామాలలో మోంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రైతులు కష్టానికి, పంట నష్టానికి అంతా కాంగ్రెస్ వైఫల్యమే కారణమని, ఫసల్ భీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు నష్టం వచ్చేది కాదని ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి, పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Reassurance to the affected farmers

You cannot copy content of this page

Scroll to Top