
అనపర్తి మాజీ ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి. నియోజకవర్గ పార్టీ అనుబంధ విభాగాల నూతన అధ్యక్షులను సత్కరించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
అనపర్తి :- అందరి సమిష్టి కృషితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) ని విజయపథంలో నడపాలని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇటీవల అనపర్తి నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించబడిన అనపర్తి మండల,నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు:
యువజన విభాగం అధ్యక్షుడు: పడాల దుర్గారెడ్డి(ఆర్ కె దుర్గా రెడ్డి), కుతుకులూరు
మహిళా విభాగం అధ్యక్షురాలు: ఇమ్మంది విజయ కుమారి, అనపర్తి
బీసీ సెల్ అధ్యక్షులు: కొండేటి భీమేశ్వర స్వామి, అనపర్తి,
క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు: ఆరుగుళ్ళ నాగేశ్వరరావు, అనపర్తి
వాలంటీర్స్ వింగ్ అధ్యక్షులు: ఈ. మహేష్, అనపర్తి
వాణిజ్య విభాగం అధ్యక్షుడు: కర్రి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి(సత్తిబాబు), అనపర్తి
లీగల్ సెల్ కన్వీనర్ : వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, అనపర్తి
పెదపూడి మండలం నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాలఅధ్యక్షులు
ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు: సాంబతుల చంటి, కాండ్రేగుల
వీవర్స్ విభాగం అధ్యక్షులు : పప్పు సింహాచలం, పెదపూడి
బిక్కవోలు మండలం నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు
ఆర్. టి. ఐ విభాగం అధ్యక్షులు: కొమరపు శ్యాంబాబు, రంగాపురం
అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు: పోలునాటి స్వర్ణలత, ఇల్లపల్లి
రంగంపేట మండలం నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు:
రైతు విభాగం అధ్యక్షులు: నలమాటి సుబ్బారావు, వడిశలేరు
మైనార్టీ సెల్ అధ్యక్షులు: సయ్యద్ ఫరీద్ భాషా, సింగంపల్లి,
విద్యార్థి విభాగం అధ్యక్షులు: బొడ్డు నాని, రంగంపేట
కల్చరల్ విభాగం అధ్యక్షులు: కొల్లం వెంకటరమణ,వడిశలేరు
డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు: ముంగి గంగరాజు, వెంకటాపురం
ఇంటిలెక్చువల్ విభాగం అధ్యక్షులు: కర్రీ శ్రీను, (కె.కోటపాడు)
మంగళవారం పార్టీ కార్యాలయంలో వీరిని మాజీ శాసనసభ్యుల వారు సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో మీ అందరి పైన బాధ్యత ఉంచి జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు పనిచేసే అందరి సమిష్టి కృషితో పార్టీని విజయపధంలో నడపాలని, పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ఎవరి కృషిని బట్టి వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానాలు కల్పించబడతాయని అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత వస్తుందని ప్రజల యొక్క సమస్యలపై భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు మనం చేయవలసి ఉంటుందని అందరి సమిష్టి కృషి పార్టీ విజయానికి నాంది అవుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో రంగంపేట జడ్పిటిసి పేపకాయల రాంబాబు అనపర్తి బిక్కవోలు పెదపూడి మండలాల పార్టీ కన్వీనర్లు సత్తి రామకృష్ణారెడ్డి పోతుల ప్రసాద్ రెడ్డి, గుత్తుల వెంకట రమణ పార్టీ నాయకులు కొల్లాటి ఇజ్రాయిల్, జిల్లా పంచాయతీ విభాగం అధ్యక్షులు పాలాటి నాగేశ్వరరావు లతో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
