Satya : తింగరి మాటలు కట్టిపెట్టండి, గంగిరెడ్డి? – సత్య

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. గడచిన ఐదేళ్ళూ పేకాట క్లబ్బులను ప్రోత్సహించింది మీరు కాదా సూర్యనారాయణరెడ్డి? – సత్య

రామవరంలో టిడిపి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు సబ్బెళ్ళ సత్యనారాయణరెడ్డి (సత్య ) మీడియాతో మాట్లాడుతూ… అనపర్తి నియోజకవర్గ ప్రజలు తింగరి గంగిరెడ్డి అని ముద్దుగా పిలుచుకునే సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎవరో వ్రాసిచ్చిన స్క్రిప్టుని బట్టీ పట్టి గత శనివారం తింగరి మాటలతో ప్రెస్మీట్ పెట్టారు

రామవరం గ్రామంలో పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారని, దానికోసం ఒక బిల్డింగ్ నిర్మించారంటూ కొన్ని తింగరి మాటలు మాట్లాడారు ఆయన, సూర్యనారాయణరెడ్డి కి ఖాళీగా ఉంటే రామవరం రావచ్చు. ఆయన ఆరోపణలలో వాస్తవం ఉంటే ఆయన చెప్పినట్లు రామవరంలో జరుగుతుంటే పోలీసు కంప్లైంట్ ఇవ్వవచ్చు అంతేగానీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు,

మా నాయకుడు ఏనాడూ పేకాట బోర్డులను ప్రోత్సహించలేదు. దాన్ని దగ్గరకు కూడా రానీయడు. గడచిన ఐదు సంవత్సరాలు పేకాట క్లబ్ లను ప్రోత్సహించింది మీరు కాదా సూర్యనారాయణరెడ్డి? ఆ ఐదేళ్ళూ మీ పార్టీ నాయకుడు ప్రతీ గ్రామంలోను పేకాట క్లబ్ లను నిర్వహిస్తుంటే పోలీసువారు నేరుగా మీకు కంప్లైంట్ చేసిన మాట నిజం కాదా? మీరు ఆ నాయకుడిని పిలిపిస్తే అతడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం అంటూ మీ ఎదురుగానే కుర్చీని తన్ని వెళిపోవడం వాస్తవం కాదా?

అలా వెళ్ళిన నాయకుడు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని భావించి తర్వాత రోజు ఆదెమ్మ, ఆశీస్సులు పొంది, డీల్ కుదుర్చుకుని ఆ తర్వాత రోజు నుండి పేకాట క్లబ్ లు రన్ చేయడం నిజం కాదా? సింగంపల్లి, ఈలకొలను సబ్ స్టేషనులో 14 షిప్ట్ ఆపరేటర్ పోస్టులు ఒక్కొక్కటి 7 లక్షల చొప్పున 98 లక్షలకు మీరు అమ్ముకోవడం వాస్తవం కాదా?

సొమ్ము వసూలు చేసిన నాయకుడిని మీరు పిలిపించి మాట్లాడుతున్న సమయంలో మెట్లు దిగుతూ వచ్చిన అమ్మ “బాబూ బుజ్జికన్నా.. ఆ నాయకుడు నొక్కిన బటన్ సొమ్ము మన ఖాతాలోనే పడింది.. ఆ సొమ్ము మనదగ్గరే ఉంది” అని చెప్పడంతో మీరు మారు మాట్లాడలేకపోవడం వాస్తవం కాదా?

ఇంట గెలిచాక రచ్చ గెలవాలి అని సామెత ఉంది. మీరు రచ్చ గెలవడం సాధ్యపడదు కానీ ముందు ఇల్లు గెలవండి. నిజంగా మీరు ఇంట గెలవాలని ప్రయత్నిస్తే మీకు పుడ్డూ ఉండదు, బెడ్డూ ఉండదు.

మీకు స్క్రిప్టు వ్రాసిచ్చిన రామవరంకి చెందిన నాయకుడు ఎన్నికల ముందు విఆర్ ఏ పోస్టులిప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గరా రూ 3 లక్షలు వసూలు చేయడం ఆ గొడవ సెటిల్మెంటు వరకూ వెళడం మీకు తెలియదా?

మీకు స్క్రిప్టు వ్రాసిచ్చిన రామవరం నాయకుడు మా యువత మీద రకరకాల లేని పోవి ఆరోపణలు చేస్తున్నాడు. అతడు అడుగు తీసి అడుగు పెట్టలేని రోజు వస్తుందని హెచ్చరిస్తున్నా

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tie up your dirty words,

You cannot copy content of this page

Scroll to Top