గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల మండలం ) జిల్లా ఇంచార్జ్ : డా.వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, కొడాపల్లి గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన, జనసేన పార్టీ,వీర మహిళలు, నాయకులు ముదిలి సుబ్బు. ఇటీవలే జి.మాడుగుల మండలం, కె.కోడాపల్లి గ్రామంలో జరిగిన గ్యాస్ దుర్ఘటనలో సోమేలి సింహాచలం, సోమేలి భాస్కర్ రావు కుటుంబాలను పరామర్శించి, వారికి పలు వస్తువులు అందించిన పాడేరు మండలం నడిమీవీధి కాలని గ్రామస్తులు మజ్జి కొండబాబు,మజ్జి సింహాద్రి,ఉల్లి అనిత,మజ్జి కొండమ్మ,మజ్జి సుచిత్ర, ముదిలి లక్ష్మి,ఉల్లి చిన్నమ్మి , కిల్లో దర్మాపతి, కీల్లో అప్పలమ్మ,కలిసి కొంత రూ.10 వేల నగదు,నిత్వసర వస్తువులు,బట్టలు ఇస్తూ వారి ఔదార్యాన్ని,సేవా తత్పరత ను చాటుకున్నారు. జనసేన పార్టీ నాయకులు గా మేము మీకు అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున నష్ట పరిహారం అందేందుకు మా వంతు సహాయ,సహకారాలు మీకు ఉంటుందని జనసేన పాడేరు మండల నాయకులు ముదిలి సుబ్బు,నడిమి వీధి కాలని వీరమహిళలు, బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App