తేదీ : 03/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం , గౌరీ శంకర్ పురం కాలనీలో అశ్వరావుపేట రోడ్డు సమీపం మూడు తూముల వద్ద సత్యనారాయణపురంలో ఉంటున్న క్రీ..శే . కె .సత్యనారాయణ రెడ్డి సావిత్రి దేవి దంపతులు ఇంటి వద్ద కరివేపాకు చెట్టు వద్దకు కరివేపాకు కోయటకు రెడ్డి కుమార్తె వెంకటరమణాంజలి ఆకు కోయచుండగా సర్పము చెట్టుమీదకు వచ్చిందని, అప్పుడు ఆమె పాము అని కేకలు వేసిందని, పక్కన ఉన్నవాళ్ళు పామును కొట్టారని, సుబ్బాయమ్మ అనే భక్తురాలు మీదకు స్వామి పూనకం వచ్చి నేను భగవంతుడను, నా పేరు సుబ్రమణ్యేశ్వర స్వామి, మీ స్థలము మంచిదని, ఇక్కడ గుడి నిర్మాణము నిర్మిస్తే అందరి కర్మ తొలగించుటకు ఇక్కడ వెళుతున్నాను అని చెప్పడం వలన గుడి నిర్మాణం పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వ సంవత్సరంలో జరిగింది. వ్యవస్థాపక ధర్మకర్తలు క్రీ శే. సత్యనారాయణ రెడ్డి, సావిత్రి దేవి దంపతులు, వాళ్ల కుమారుడు, కోడలు పునర్నిర్మాణ ధర్మకర్తలు కర్రీ.
శ్రీరామ రెడ్డి, సుగుణ దంపతులు, ఆయన కుమార్తె కె. సాయి షణ్ముఖి, కుమారుడు కె. మోక్షిత్ ఫణి సాయి రెడ్డి ప్రతి మంగళవారం ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి తమ కోరికలను మొక్కుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. కొబ్బరికాయల కొట్టి, పాలాభిషేకంతో దేవుణ్ణి పూజిస్తున్నారు. తేదీ 05/06/2025.వ తేదీన సంరక్షణ కార్యక్రమం, అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఎటువంటి అనారోగ్యం లేకుండా, సిరిసంపదలతో, కలిగి ఉండాలని, కోరుకుంటున్నామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


