జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 31 at 22.25.01

TRINETHRAM NEWS

మహిళను గొంతు నులిమి చంపిన భర్త…

త్రినేత్రం న్యూస్. ముత్తారం ఆర్ సి

కట్టుకున్న భార్యను కడ తేర్చిన విషాద ఘటన మంథని మండలంలోని గోపాలపూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మంథని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన బొల్లి ఓదెలు (35) ముత్తారం మండలంలోని జిల్లెల్ల పల్లె గ్రామానికి చెందిన గడ్డం రాజేశం కూతురు సంధ్యను గత 8 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం ఓదెలు పక్క గ్రామమైన మంథని మండలం గోపాలపూర్ శివారులో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఒక ఇంట్లో అద్దె కుంటూ జీవిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో గొడవలు జరగగా ఆవేశంతో ఓదెలు భార్యను గొంతు నులిమి హత్య చేశాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మంథని సిఐ రాజు, ఎస్ఐ రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page