తేదీ : 10/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ రాణి తోట, పోతురాజు గుడి వద్ద ఆర్.సి.యం పాఠశాల పక్కన ఉన్నటువంటి వేముల దుర్గారావు మరియు ఆయన పిన్ని ఆ రెండు కుటుంబాలకు ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరడం జరిగింది. పనికి వెళితేనే జీవనం సాగుతుంది. వెళ్లకపోతే ఆరోజు పస్తులే.
ఇంటికి సంబంధించి గ్రామ సచివాలయంలో సంబంధిత పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల తహసిల్దార్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ న్యాయం ఇంతవరకు చేయలేదు. మాకు ఇంటి పట్టాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


