
వైద్య యంత్రంగాన్ని కదిలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్: బలబద్రపురం. బలభద్రపురం గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి,
వైద్య యంత్రాంగాన్ని కదలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
ఆఘమేఘాల పై స్పందించిన ప్రభుత్వం,
జి ఎస్ ఎల్ హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్ సహకారం కోరిన ఎమ్మెల్యే నల్లమిల్లి,
నేడు గ్రామంలో పర్యటిస్తున్న 20 వైద్య బృందాలు
ఇంటింటికీ సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహణ,
వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్న ఎమ్మెల్యే నల్లమిల్లి,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ…
బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారన్న విషయం వెలుగులోకి రావడం, అదే సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న సంగతి కూడా వెలుగులోకి వచ్చింది,
నిన్నటి రోజున గ్రామంలోని నలుగురు చిన్న పిల్లలకు అతి అరుదైన కాలేయ సంబంధిత వ్యాధి రావడం అనేది ఆందోళన చెందవలసిన విషయం,
వారిలో ఒక బాలుడికి లివర్ ట్రాన్స్ పర్టేషన్ జరిగింది. అతని తల్లిదండ్రులు రూ 75 లక్షలు ఖర్చు చేసారు. మరో ముగ్గురు చిన్న పిల్లలు అదే రకమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు,
ఆ ఒక్క గ్రామంలో ఇన్ని రకాల వ్యాధులు ఎందుచేత ప్రబల్లుతున్నాయి? దీనికి కారణం జలకాలుష్యమా? వాయు కాలుష్యమా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అనేది గుర్తించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికి మూల కారణం వెలికితీయాలనేది నా తపన
ఈ విషయం నాకు తెలిసిన వెంటనే శాసనసభలో మాట్లాడటం దానికి ముఖ్యమంత్రి, కార్యాలయం స్పందించడం వెంటనే జిల్లా యంత్రాంగం గానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గానీ కాలుష్య నియంత్రణ మండలి కానీ ఈ సమస్యపై ప్రత్యేకమైన శ్రద్ద వహించడం జరిగింది,
ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అంతా బలభద్రపురంలో మెడికల్ క్యాంపు రన్ చేయడం జరుగుతా ఉంది. ఇరవై బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ సర్వే చేసి వైద పరీక్షలు చేసి వ్యాధి నిర్దారణ కోసం గ్రామంలో పర్యటనలు చేస్తున్నారు,
నేను జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజ్, స్వతంత్ర కేన్సర్ హాస్పిటల్ సహకారం కూడా కోరడం జరిగింది. నిన్న జి ఎస్ ఎల్ ఛైర్మన్ భాస్కరరావు, ఈరోజు స్వతంత్ర హాస్పిటల్ హెడ్ తరుణ్,నాతో మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వానికి కూడా ముగ్గురు ఆంకాలజిస్ట్ ల సపోర్ట్ ఇవ్వడం జరిగింది,
జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ వారి మొబైల్ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాన్ని మొదటివారంలో నాలుగైదు రోజుల పాటు బలభద్రపురంలో ఉపయోగించడావికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ సంపూర్ణంగా పరీక్షలు స్వతంత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో చేసేలా ఏర్పాటు చేయడం జరిగింది,
ఇవన్నీ వ్యాధి బారిన పడిన వారిని కాపాడటం కోసం తీసుకుంటున్న చర్యలు అయితే అసలు బలభద్రపురం మరియు చుట్టుప్రక్కల రెండు మూడు గ్రామాలు ఎందుకు ఈ వ్యాధి బారిన పడుతున్నాయో శోధించవలసిన అవసరం ఉంది
నిన్న నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ గారితో మాట్లాడటం జరిగింది. వెంటనే వారు పొల్యూషన్ బోర్డు అధికారులను పంపించి జలకాలుష్యం, వాయు కాలుష్యం మరియు ఇతర కాలుష్యాలకు సంబంధించి అధ్యయనం చేయవలసిందిగా తగు ఆదేశాలిచ్చారు. త్వరలోనే నిపుణుల కమిటీ వస్తుంది,
అన్ని విధాలుగా విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం ద్వారా నివారణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు స్పష్టం చేస్తున్నాను
ఈ సందర్భంగా అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి తప్పుడు నివేదికలు ఇవ్వకండి. సాక్షాత్తూ ఆ గ్రామంలో గత ఆరేడు మాసాల కాలంలో పది నుండి పన్నెండు కుటుంబాలలోని వ్యక్తులు కేన్సర్ తో మరణిస్తే స్వయంగా నేను వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మరి మీరు మూడే ఉన్నాయి ఆరే ఉన్నాయని నివేదికలు ఎలా ఇస్తారు?
మీరు పి హెచ్ సి లలో లెక్కలు మాత్రమే తీసుకుని ప్రభుత్వానికి లెక్కలు చెప్పి ప్రైవేటు హాస్పిటల్స్ లో చేరిన వారి లెక్కలు వదిలేయడం ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం కాదా?
నిన్న జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల నివేదిక చూసి కమీషనరు, ఆశ్చర్యపోయి నాతో మాట్లాడటం జరిగింది. వారికి అసలు సంగతి చెప్పి ప్రజలు అనుమానిస్తున్న సంఖ్య కాకపోయినా కనీసం యాభై మంది కేన్సర్ బారినా పడినా సరే అది కూడా పెద్ద సంఖ్యే తప్పనిసరిగా మనం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని వారికి చెప్పడం జరిగింది,
వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించి ఈరోజు గ్రామానికి అధికారులను పంపించడం జరిగింది,
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ గారితో నేను మాట్లాడితే వారు త్వరలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ కి సంబంధించిన నోడల్ టీమ్ ని పంపుతానని హామీ ఇచ్చారు,
ఆఘమేఘాల మీద కూటమి ప్రభుత్వం సమస్యపై స్పందించింది. గత ప్రభుత్వ నిర్వాకంతో ఈ సమస్య పుట్టింది. దీన్ని సరిచేయడం కోసం నేడు మేము ముందుకు వచ్చాం,
ప్రజలందరూ దీనికి సహకరించాలి. పరీక్షలు చేయించుకోడానికి నామోషీ పీల్ అవవద్దు. సమాచారం గోప్యంగా ఉంచుతాం. ప్రభుత్వం మీ వెంట ఉంది. ఎవరికి ఏ విధమైన వైద్య సహాయం అందించాలో ఆ విధంగా చర్యలు చేపడతాం. నేను వ్యక్తిగతంగానే ఈ విషయాన్ని ప్రత్యేక శ్రద్దతో పర్యవేక్షిస్తానని, ఏ అవసరం ఉన్నా వ్యక్తిగతంగా నేను హాజరై సహాయం అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
