Ramavath Ravindra Kumar : ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది

మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 02 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్అన్నారు.

సోమవారం దేవరకొండ మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన ఆనంద్ తోపాటు 50మంది బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాఅధ్యక్షులు,దేవరకొండమాజీశాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గత పదేండ్లలో కెసిఆర్ చేసిన అభివృధి సంక్షేమాన్ని చూసే ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు అనిఆయనఅన్నారు.రెండేళ్లలో పైసా పని చెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి అని ఆయన అన్నారు.

బిఆర్ఎస్ హయంలో కేసీఆర్ నాయకత్వంలోనే దేవరకొండ అభివృద్ధి జరిగింది అని ఆయన తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 100కోట్లతో మున్సిపాలిటీలో అనేక పనులు చేపట్టాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేతావత్ బిల్యా నాయక్,నేనావత్ కిషన్ నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, 2వ వార్డు అభ్యర్థి పొట్ట మురళి, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసీరామ్, వడత్య బాలు,శ్రీను,నేనావత్ నాగార్జున,పెద్దయ్య,అందుగులసైదులు,కొమ్ముఉదయ్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

lesson in the municipal elections

You cannot copy content of this page

Scroll to Top