ప్రతి నియోజకవర్గానికి రూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం జిల్లాలకు కలుపుకుని రూ.
1190 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 10 కోట్లలో రూ. 2 కోట్లు విద్యాభివృద్ధి కోసం, రూ. కోటి తాగునీటి సౌకర్యం కోసం, నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం వెచ్చించాలని పేర్కొంది. జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదంతోనే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా రూ. 130 కోట్లు కేటాయించగా అందులో రూ. 26 కోట్లు ప్రాథమిక విద్యా సదుపాయాలు, రూ. 13 కోట్లు తాగునీటి సౌకర్యం, రూ. 6.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. మహబూబ్ నగర్ రూ. 140 కోట్లు, ఖమ్మం రూ. 100, రంగారెడ్డి రూ. 140, వరంగల్ రూ.120, హైదరాబాద్ రూ. 15 మెదక్ రూ. 100 కోట్లు, ఆదిలాబాద్ 100 కోట్లు, నల్గొండ రూ. 120 కోట్లు, నిజామాబాద్‌ రూ. 90 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

You cannot copy content of this page

Scroll to Top