జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 30 at 4.14.07 PM

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది.

అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌ మున్సిపాలిటీకి చెందిన భూమిలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

ఆ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు పనులు కొనసాగుతుండగా గద్దర్‌ అంటే గిట్టని కొందరు వ్యక్తులు, హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులు, పోలీసులు పనులు జరుగకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

You cannot copy content of this page