ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని,
సామాజిక విప్లవకారిణి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సమతా విధాత సావిత్రీబాయి పూలే 194 వ జయంతి ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుకోవాలని ప్రకటించిన నేపథ్యంలో
తల్లీ సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలు ప్రభుత్వ ఐటిఐ కళాశాల పెద్దపల్లి లో ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి ట్రైనింగ్ ఆఫీసర్లు మల్లికార్జున్, శ్రీనివాస్ తో పాటు అధ్యాపక బృందం మరియు విద్యార్తిని విద్యార్థులు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుక లో పలువురు తల్లీ సావిత్రి బాయి పూలే త్యాగాలను కొనియాడారు. తర్వాత విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటలపోటీలు నిర్వహించి పెన్నులు(కలములు) ప్రధానం చేశారు అదేవిధంగా కళాశాల లో పని చేస్తున్న మహిళా అధ్యాపకులకు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App