MLA Jare Adinarayana : కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యులకు సొంతింటి కల నెరవేరబోతుంది ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ 23.05.2025. అశ్వారావుపేట నియోజకవర్గ, శాసనసభ సభ్యులు జారే ఆదినారాయణ స్వగ్రామ మైన గండుగులపల్లి గ్రామ, పంచాయతీ లో ఇందిరమ్మ గృహాలకు అర్హత, పొందిన. లబ్ధిదారుల కు హక్కు పత్రాలను ఈ రోజు గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,రేవంత్ రెడ్డి, నాయకత్వంలోని, రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు గృహ హక్కుల కోసం, కృషి చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబం తలదాచుకునే ఇంటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల అమలను వేగంగా అమలు చేస్తోందన్నారు
ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.వో రవీందర్ రెడ్డి, ఎం.పీ.ఓ రామారావు , స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The dream of owning

You cannot copy content of this page

Scroll to Top