Collector Koya : పెద్దపల్లి సుభాష్ నగర్ లోని ప్రాథమిక పాఠశాల, తహసిల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

పెద్దపల్లి, జూలై 24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.. *పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ విద్యార్థులకు చదివింది అర్థం చేసుకునే సామర్థ్యం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు.

ఆదివారం నాటికి ప్రతి దరఖాస్తుకు నోటీస్ జనరేట్ చేయాలని, ప్రతి రోజూ కనీసం 20 దరఖాస్తులు డిస్పోస్ చేయాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజయ్య, ఏ.ఎం.ఓ పి.ఎం షేక్ , హెడ్ మాస్టర్ మనోహర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector inspected the primary school

You cannot copy content of this page

Scroll to Top