వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గం ప్రతినిధి,త్రినేత్రం. న్యూస్. హైదరాబాద్ రోడ్ రాజీవ గృహ కల్ప దగ్గర ఉన్న,తెలంగాణ ప్రభుత్వ ,మాత శిశు హాస్పిటల్ లోఎన్నారంగ్రామం,కోటిపల్లి మండలం కు చెందిన గర్భిణీ మహిళ,ను సీజరిన్ ఆపరేషన్ చేసి పాపను తీసినారు,కానీ సీజరిగిన తల్లిని నిర్లక్ష్యం చేశారని,అందుకే పుట్టిన పాప భ్రతికింది కానీ తల్లి చనిపోయిందని ,ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.ఆ బాలింత మృతి పట్ల పై అధికారులు సమగ్ర విచారణ చేయాలన్నారు.అలాగే బాధిత పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.వైద్యుల యొక్క నిర్లక్ష్యం కారణంగా గత పోయినా నెలల నుండి గర్భిణీ మహిళలు చనిపోవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.
చనిపోయిన గర్భిణీ మహిళ కుటుంబానికి సానుభూతి తెలియ జేశారు.డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు తమ సొంత హాస్పిటలు ,పెట్టుకొని ప్రైవేటుగా నడిపిస్తుంటే వైద్యాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికైన వైద్య ఉన్నతాధికారులు వెంటనే మాత శిశు హాస్పిటల్ ను తనిఖీ చేసి సరియైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.లేదంటే ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు,వారి సమస్యలపైన పెద్ద ఎత్తున అందో లన చేయవలసిన అవసరం వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాస్ ,కె న్ పి ఎస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు.ఏ చెంద్రప్ప.ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు,P. అనందు కుమార్ ,పి డిఎసు యు జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ముదిరాజ్.వెంకటేష్,నవీన్,వీరేశం,రాములు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


