జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 30 at 2.32.04 PM

TRINETHRAM NEWS

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

రంగారెడ్డి నగర్ డివిజన్ గుబురుగుట్ట స్థానిక సీపీఐ నాయకులు జాఫర్ బాయ్ కుమారుడు ఖాదర్ నేడు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు.
ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు వారి పార్థివమృత దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సీపీఐ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఖాదర్ మృతి బాధాకరమని వారి కుటుంబానికి సీపీఐ పార్టీ అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తుందని వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఖర్చుల కోసం పార్టీ తరపున కొంత ఆర్థిక సహకారం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్,మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్,ప్రజానాట్యమండలి నాయకులు రాములు,శాఖ కార్యదర్శి యాదగిరి, మల్లేష్,వెంకటేష్,జాఫర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page