రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి గడువు జనవరి 31
రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది.