TELANGANA

Erra Krishna Jambhav : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి

TRINETHRAM NEWS

ఎర్ర కృష్ణ జాంభవ్

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 02 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, పట్టణాల్లో సుస్థిరమైన అభివృద్ధి,మౌలికసదుపాయాల మెరుగుదలకొనసాగాలంటే దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకుఅత్యధికమెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ పట్టణప్రజలను కోరారు.

తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రవ్యాప్తంగాఅమలవుతున్నసంక్షేమపథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు పట్టణాలకు కూడా విస్తరించాలని, దానికి మున్సిపల్ సంస్థల్లో కాంగ్రెస్ బలమైన ప్రాతినిధ్యం అవసరమని ,ముఖ్యంగా దేవరకొండ పట్టణంలో రోడ్లు, మంచినీటిసరఫరా,పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కీలకమనిఆయనఅభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఇప్పటికే దేవరకొండ నియోజకవర్గంలో, పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకల్పన,రోడ్లనిర్మాణం, పరిశుభ్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వంటివి ఎమ్మెల్యే నిరంతర ప్రయత్నాల ఫలితంగా జరుగుతున్నాయని, ఈ కృషిని మరింత బలోపేతం చేయడానికి మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం అవసరమని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వృద్ధాప్య భద్రత వంటి పథకాలు పట్టణ ప్రజలకు కూడా ఎంతోఉపయోగకరంగాఉన్నాయని, వీటినిమరింతసమర్థవంతంగా అమలుచేయడానికిమున్సిపల్ కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాలని ,ప్రజలు తమ సమస్యలను గుర్తించి, అభివృద్ధి దిశగాఅడుగులువేసేకాంగ్రెస్అభ్యర్థులకుఅండగానిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Congress party should be given the mandate

You cannot copy content of this page