అల్లూరి జిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ జనవరి 6 : కార్మికులు పోరాడిసాదించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన,నాలుగు లేబర్ కోడ్ కార్మికులకు వెట్టి చాకిరి చేయించి పెట్టుబడి దారులకు కార్మికుల శ్రమను దోచుపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. ఎటువంటి నోటీసులు లేకుండా కార్మికుల పని నుండి తొలగించే అధికారం యాజమాన్యం చేతుల్లో ఉంటుంది.
కొత్త కార్మిక లేబర్ కోడ్ ప్రకారం 50 మంది కార్మికులు ఉంటే లంచ్ రూమ్ ఇవ్వరు, 500 మంది లోపు కార్మికులు ఉంటే అంబులెన్స్ సౌకర్యం అవసరం లేదు, అంటున్నారు. ఇటువంటి అనేక ఆంక్షలు కార్మికులు వర్తించే విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం 8 నుండి 12 గంటల వరకు కార్మికులు పనిచేయాలని చట్టం చేసింది, బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలన్నిటి కీ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదిస్తున్నాయి .ఇది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉన్నాయి. పనిగంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకోవడానికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్రచేస్తుంది.ఈ కుట్రాలను ఐక్యంగా తిప్పికొట్టాలని,ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది.
కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, తులసమ్మ, లక్ష్మి,రాజు పి.బాలకృష్ణ ,కె.రామారావు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App