CM Revanth : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. కొడంగల్ కు రాష్ట్ర ముఖ్య మంత్రి చేరుకున్న సందర్బంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ పేట్ కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్ పి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం స్వామి 45 వ వార్షిక బ్రమోత్సవా ల సందర్బంగా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్న సందర్బంగా ఆలయ వేద పండితులు పూర్ణ కుంభం తో బాజా భజంత్రి లతో స్వాగతం పలికారు. 45 వ వార్షిక బ్రాహ్మత్సవ ము సందర్బంగా స్వామి వారికీ శేష వస్త్రాలు సమర్పించారు.. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద ఆశీర్వచనము స్వీకరించారు. ఆలయ అర్చకులు తిరుమల తిరుపతి స్వామి వారి శేష వస్త్రాలు ముఖ్య మంత్రి కి బహుకరించారు. బ్రమోత్స వాలలో నాలుగవ రోజు యాగ శాలలో ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు బ్రాహ్మణ లచే ఆశీర్వాదం పొందారు.
ఈ కార్యక్రమం లో తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి,గురునాథ్ రెడ్డి, దేవాదాయ శాఖ కమీషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి నారాయణ రెడ్డి. టెంపుల్ ఇ ఒ రాజేందర్ రెడ్డి, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Chief Minister participated

You cannot copy content of this page

Scroll to Top