దుండిగల్: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్టీఎల్ బఫర్ జోన్) ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్దిచెబుతున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడుక చెందిన భవనాల కూల్చివేశా
Related Posts
పోలీస్ కమీషనరేట్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్
TRINETHRAM NEWS పోలీస్ కమీషనరేట్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల…
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
TRINETHRAM NEWS ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు,కోరు కంటి చందర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పట్టణంలోని తన నివాసంలో కలిసి…