
త్రినేత్రం న్యూస్. రాజమండ్రిలో పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ… ఇటీవల బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోవడం గురించి అసెంబ్లీలో నేను ప్రస్తావించడం, ఆ వెంటనే రాష్ట్రప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి వైద్యబృందాలను గ్రామానికి పంపి సర్వే చేయించడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేసేందుకు సంకల్పించడం జరిగింది. కానీ ఇక్కడ కొందరు జిల్లా స్ధాయి అధికారుల కారణంగా విషయం ప్రక్కదారి పట్టడం జరిగింది.
ప్రభుత్వ స్పందన తర్వాత డి డి ఎమ్మరియు ఎచ్ ఓ కేవలం 6 కేసులే ఉన్నాయని ప్రకటించడం, కమీషనర్ గారు నాతో మాట్లాడటం, నేను వారితో కేవలం పీహెచ్ సి ల రిపోర్టునే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు నేను గ్రామస్దుల సమాచారంతోబాటు, స్ధానిక వైద్యుల సమాచారం ఆధారంగానే ఈ నిర్దారణకు వచ్చానని తెలియజేసాను. దాంతో వారు టీమ్స్ ని పంపడం జరిగింది.
అధికారులు ముందుగా చెప్పిన అంకెను ఫిక్స్ చేయడం కోసం వారు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను మరుసటిరోజున తప్పు పట్టడం జరిగింది. సైంటిఫిక్ విధానంలో కాకుండా ఓరల్ గా ప్రశ్నలు సంధించడం ద్వారా రిపోర్టులు సేకరించి 32 కేసులు మాత్రమే ఉన్నాయి ఇది నేషనల్ యావరేజ్ కి సరిపోతుంది అని అధికారులు తేల్చడం జరిగింది. దాన్నే బేస్ చేసుకుని ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టరు గానీ ఒక నిర్ధారణకు రావడం జరిగింది.
తరునాత దీనిపై మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. ముందుగా స్పందించిన ఈనాడు మీడియా గ్రామంలో సర్వే చేపడితే మొదటి రోజున పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యను మీడియా ముందు ఉంచడం జరిగింది అయితే తర్వాత రోజు గ్రామంలో సోషల్ సిగ్మా వస్తుందనే ప్రచారం జరగడంతో మీడియా ముందుకు రావడానికి ప్రజలు సంకోచించారు.
ఈ ఆందోళనకర పరిస్దితుల నేపధ్యంలో మరో ప్రక్క ఈ సమస్యకి కారణభూతులుగా భావిస్తున్న వైయస్సార్ సిపి నాయకులు గ్రామంలో భూమి రేటు పడిపోతుంది, పిల్లలకు పెళ్ళిళ్ళు కావు వంటి తప్పుడు ప్రచారాలను ఉధృతం చేయడంతో గ్రామస్ధులలో భయాందోళనలు పెరిగిపోయాయి. దీంతో గ్రామస్ధులలో స్తబ్దత నెలకొంది.
అయినప్పటికీ అధికారులు చెప్పిన సంఖ్య 32 ని చూసుకుంటే దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న కేరళ రాష్ట్ర యావరేజ్ కంటే బలభద్రపురం యావరేజ్ డబుల్ ఉంది. 2022 లో పార్లమెంటులో చెప్పిన విధంగా దేశంలో ప్రతివేల జనాభాకు పది కేసులు నమోదు ఉంటే బలభద్రపురంలో 32 కేసులు అంటే నేషనల్ యావరేజ్ కంటే 3 రెట్లు ఉన్నాయి.
ఇటీవలే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో బలభద్రపురంలో సర్వే నిర్వహించారు. 399 కుటుంబాలనుండి 1295 మందికి వివిధ పద్దతులలో పరీక్షలు చేయగా 62 కేసులు ఉన్నట్లు గుర్తించింది. గ్రామ జనాభా పదివేలు ఉంది. మిగిలిన 8705 మందికి సర్వే చేస్తే ఇంకెన్ని కేసులు ఉండొచ్చో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ 62 కేసులనే తీసుకుంటే ఇది నేషనల్ యావరేజ్ కంటే 6 రెట్లు ఎక్కువ. స్ధానిక డి ఎమ్&ఎచ్ ఓ గానీ స్ధానిక అధికారుల నిర్లక్ష్యం గానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.
దేశవ్యాప్తంగా ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను తీసుకుంటే మొదటగా కేరళ తర్వాత మిజోరాం, హర్యానా, డిల్లీ, కర్ణాటక, గోవా, హమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లు మొదటి 8 స్ధానాలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడో అట్టడున ఉంది. నేషనల్ యావరేజ్ గురించి మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్ యావరేజ్ గురించి మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తో పోల్చితే బలభద్రపురం చాలా అధికం.
హెల్త్ కి సంబంధించిన న్యూస్ ఛానెల్ బయోవాయిస్ 2022 లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ టాప్ 8 రాష్ట్రాల తర్వాత స్ధానం యుపి, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ ఉండగా ఏపికి ఎక్కడా చోటు దక్కలేదు. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ యావరేజ్ కంటే ఐదారు రెట్లు ఎక్కువ కేసులు నమోదవుతున్న బలభద్రపురం పై ప్రభుత్వం దృష్టి సారించి మూలకారణం కనిపెట్టాలి.
గ్రామస్ధులు సోషల్ సిగ్మా వస్తుందని నిర్లక్ష్యం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్లక్ష్యం వలన మరణాలు పెరిగిపోతాయి. ప్రజలలో చైతన్యం రావాలి. స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలి తద్వార కేన్సర్ నిర్దారణ జరిగితే వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మూలకారణం కనిపెట్టడం ద్వారా బలభద్రపరం గ్రామాన్ని పరిసర గ్రామాలను పరిరక్షించుకోగలం.
ఆ ప్రాంతంలో నెలకొన్ని ఉన్న పరిశ్రమల వలన ఇటువంటి పరిస్గితులు వచ్చాయనేది అక్కడి ప్రజల అభిప్రాయంగా ఉంది. మూడేళ్ళ క్రితం అప్పటి సియం జగన్మోహనరెడ్డి, చేతుల మీదుగా ఇక్కడ గ్రాసిం ఇండస్ట్రీ ప్రారంభించారు. పబ్లిక్ హియరింగ్ సమయంలోనూ, జగన్మోహనరెడ్డి, వచ్చినపుడు కూడా మమ్మల్ని అభిప్రాయం చెప్పనీయకుండా హౌస్ అరెస్టులు చేసారు. 52 కెమికల్స్ ఉత్పత్తికి పర్మిషన్ తీసుకుని ప్రస్తుతం 6 రకాలు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతున్న పరిస్దితులలో అక్కడి వాటర్ ని పరీక్ష గురించి పొల్యూషన్ అధికారులని అడిగితే అక్టోబరులో చేసాం అంటున్నారు తప్ప రిపోర్టులు సమాధానం దొరకదు. ఒక ఎమ్మెల్యే, ప్రశ్నిస్తే ఇలాంటి పరిస్దితి ఉంటే ఇంక సామాన్యుల పరిస్దితేంటి? ఇక్కడ 15 సంవత్సరాల నుండి కేపీర్ ఫెర్టిలైజర్స్ రన్ అవుతూ ఉంది మరో ప్రక్క గ్రాసింకు అతికొద్ది దూరంలో నల్లమిల్లి గ్రామంలో కేపీర్ ఆగ్రో కెమ్ ఉంది. పది సంవత్సరాల నుండి 15 రకాల ఫెస్టిసైడ్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఇన్ని రకాల దారుణమైన పరిస్దితులు ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దహించివేస్తున్నాయి.
రాజ్యాంగంలోని 21 వ ఆర్టికల్ ప్రకారం కాలుష్య రహిత వాతావరణంలో జీవించే హక్కు ప్రజలకు ఉంది అని సుప్రీంకోర్టు రెండ్రోజుల క్రితమే తీర్పునిచ్చింది. ఆనాడు గ్రాసిం రెండో విడత పబ్లిక్ హియరింగ్ లో పొల్యూషన్ గురించి నేను మాట్లాడుతుంటే నాటి ఎమ్మెల్యే, సత్తి సూర్యనారాయణరెడ్డి, మెడిసిన్ లో పోస్టు గ్రాడ్యుయేట్ అయి ఉండి 35 సంవత్సరాలపాటు హౌస్ సర్జన్ చేస్తూ ఉండి కూడా చిమ్మీ లోంచి పొగ వస్తుందా ఇక్కడ? పొగ లేనిదే పొల్యూషన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు మమ్మల్ని. ఇటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో సుప్రీం తీర్పు ఒక చెంపపెట్టులాంటిది.
ఈ నేపధ్యంలో ఇన్ని ప్రమాదకర పరిశ్రమలు ఇక్కడ ఉండటం వలన ఈ పరిస్దితి వస్తుందా అనే అనుమానంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్,ని విచారించమని కోరడం వారి ఆదేశంతో శాస్త్రవేత్తలు రావడం శాంపిల్స్ తీసుకువెళ్ళడం జరిగింది. నేను కూడా ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గ్రాసిం ఇండస్ట్రీకి దగ్గరలో వాటర్ శాంపిల్స్ పరీక్ష చేయించడం జరిగింది. హార్డ్ నెస్ 200 నుండి 600పీపీఎం ఉండాల్సింది 800 ఉంది. హార్డ్ నెస్ పెరిగిన వాటర్ త్రాగిన వారికి అనేక రోగాలొచ్చే అవకాశం ఉంది. మెగ్నీషియం 30 ఉండాల్సింది 73 ఉంది. 45 దాటకూడని నైట్రేట్ 57 ఉంది. ఈ ప్రమాదకర పరిస్దితులలో ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా పనిచేయాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
