జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 16 at 3.35.54 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌: మెట్రోరైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)ని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం సందర్శించారు. మెట్రోరైలు ఆపరేషన్స్‌కు గుండెకాయలాంటి ఓసీసీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆయనను ఓసీసీని సందర్శించాల్సిందిగా మెట్రోరైలు సంస్థ అభ్యర్థించగా నాగోల్‌కు వచ్చారు.  అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించడంపై ఆయన అభినందించారు. ఎండీ కేవీబీరెడ్డి, సీవోవో సుధీర్‌ చిప్లూంకర్‌, సీఎస్‌వో మురళీవరదరాజన్‌లు హైదరాబాద్‌ మెట్రో, ఓసీసీ ప్రత్యేకతల గురించి వివరించారు….

You cannot copy content of this page