త్రినేత్రం న్యూస్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకున్నారు.. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ప్రభుత్వ విప్ కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా పడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని,ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని అ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నారు…


