Telangana State Auto Unions JAC emergency meeting at Peddapally district level
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లో బి ఆర్ యస్ ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలారాపు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జె ఏ సి రాష్ట్ర అధికార ప్రతినిధి దార మదు,రాష్ర్ట ఉపాధ్యక్షులు మాతంగి శివరాజ్ లు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా ఈ నెల 31 బుదవారం నాడు అసెంబ్లీకి వినతి పత్రం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆటో డ్రైవర్లకు బడ్జెట్ కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
తక్షణమే ఆటో డ్రైవర్ల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల బడ్జెట్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం.ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని,తదితర డిమాండ్లతో సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాశీపేట రాజయ్య,కార్పొరేషన్ అధ్యక్షులు అంబాల శంకర్,డ్రైవర్స్ రేణికుంట్ల సురేష్,తుంగపెల్లి నర్సయ్య,చినుముల మహేందర్,వీసాల లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App