జూలై 7, 2026

WhatsApp Image 2024 10 24 at 18.59.09

TRINETHRAM NEWS

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా సమావేశం
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

హైదరబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాష్ మున్షీ, తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ ఫారమల చైర్ పర్సన్ శ్రీమతి సుప్రియ శ్రీనేట్ , నేషనల్ సెక్రెటరీ ఏఐసీసీ కమ్యూనికేషన్, పబ్లిసిటీ మరియు మీడియా రుచిర , ఏఐసీసీ సోషల్ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ విపిన్ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ మరియు టీజిటిఎస్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్, మరియు రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పట్టేం నవీన్, నిర్వహించారు…
చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఆకుల అజయ్ మాట్లాడుతూ
నియోజకవర్గంలో సోషల్ మీడియాని బలోపేతానికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు…
రానున్న పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొరకు నియోజకవర్గంలో గెలుపు కోసం పనిచేస్తామన్నారు…
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆరు పథకాల హామీలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తామన్నారు…*
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మల్యాల మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పొన్నం మల్లేషం గౌడ్, చొప్పదండి టౌన్ కో ఆర్డినేటర్ సంబోజి సునీల్, రామడుగు మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జవ్వాజి అజయ్, చొప్పదండి మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బండారి రాజేష్, పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page