
Telangana Jalasiri : డిండి (గుండ్ల పల్లి) జులై 28, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి (గుండ్ల పల్లి)మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన తెలంగాణ జలసిరి మండల స్థాయి సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ పి శ్రీనివాస్ అధ్యక్షత వహించి ప్రసంగించారు .
సమావేశం ను కోఆర్డినేషన్ చేస్తూ ఎంపీడీవో ఎన్ వేజన మాట్లాడారు.. ఎలినినో సమస్యను ఎదుర్కోవాలంటే తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం తప్పనిసరి అని ఇంటికో ఇంకుడు గుంత పొలానికి పంట కుంట ప్రతి ఊరికి ఊరకుంట నినాదంగా ముందుకు వెళ్తూ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా అన్ని ఇండ్లకు సోక్ పిట్స్ రైతు పొలాల్లో ఫార్మ్ పండ్స్ ప్రతి ఊరికి ఊట కుంట తో పాటుగా డ్రైనేజీ ఎండ్ సోక్ పిట్ ప్రతి బోర్ దగ్గర రీఛార్జి పిట్ రూప్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించుకొని ప్రతి వర్షం చుక్కను గ్రామంలోనే ఇంకే విధంగా ప్రయత్నం చేయాలని గ్రామంలోని ప్రతి వివో ఏ కూడా విధిగా పాల్గొనాలని అన్నారు .
బుధవారం జరగబోయే 39 గ్రామపంచాయతీలలో గ్రామ సభలో తీర్మానాలు తీసుకున్న వెంటనే టెక్నికల్ అసిస్టెంట్స్ వెంటనే ఎస్టిమేషన్స్ వేయాలని ఆదేశించారు .దీనికి స్పందిస్తూ ఏపీ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమము విజయవంతం చేస్తూ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబడతామని పేర్కొన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ధనంజయ మాట్లాడుతూ ప్రతి హ్యాండ్ బోర్ దగ్గర బోర్ బావి దగ్గర రీఛార్జ్ పిట్స్ నిర్మించడంలో పాల్పంచుకుంటామని అన్నారు ఏపీ ఏం మాట్లాడుతూ గ్రామ సమైక్య తరఫున ఎస్ హెచ్ జి లు తప్పనిసరి పాల్గొని విజయవంతం చేసేటట్లు సీసీలతో వీ ఓ ఏ లతోకలిసి పనిచేస్తామని అన్నారు.
ఈకార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచులు మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు , సీ సీ లు ఫీల్డ్ అసిస్టెంట్స్ వివో ఏలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe