జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Ramanamma services are unforgettable

రమణమ్మ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్

Ramanamma Services : దేవరకొండ డివిజన్ జూన్ 02, త్రినేత్రం న్యూస్. 42 సంవత్సరాల పాటు విద్యారంగానికి విశిష్ట సేవలందించి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన గౌరవనీయ ఉపాధ్యాయురాలు వి. రమణమ్మ పదవీ విరమణ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొనీ ఆమె చేసిన సేవలను కొనియాడారు. రమణమ్మ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమ్మ ని ఘనంగా సన్మానించారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆమె సేవలను , నాలుగు దశాబ్దాలకు పైగా అంకితభావంతో విద్యాబోధన చేసి, సమాజానికి విలువైన పౌరులను అందించిన రమణమ్మ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని, రమణమ్మ వంటి గురువులు సమాజానికి ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే అన్నారు. ఆమె పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page