
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధరనెల్లూరు నియోజకవర్గoపెనుమూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు.
తరువాత కేక్ కట్ చేసి మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు తలారి రెడ్డప్పకు తినిపించారు. ఆ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ మాజీ చైర్మన్ పట్నం పరమేశ్వర్ రెడ్డి విక్రమ్ ధనరాజ్ ఏకాంబరం మాధవి రాధమ్మ మరియు దళిత గ్రామాల నుంచి యువత మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
