Air Travel : ట్యాక్సీ.. ఏకంగా గాల్లోనే ప్రయాణం!

TRINETHRAM NEWS

Trinethram News : రోజురోజుకీ ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగా ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ట్యాక్సీ కంపెనీలు కొత్తగా ఆలోచిస్తున్నాయి. రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ను ఓవర్కమ్ చేసేలా గాల్లో ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉబర్ హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీస్ గురించి ఆలోచిస్తోంది.

హెలికాప్టర్ రైడ్స్

ప్రముఖ ట్యాక్సీ బుకింగ్ కంపెనీ ఉబర్.. తమ యాప్లో హెలికాప్టర్ రైడ్స్ కూడా బుక్ చేసుకునేలా కొత్త సర్వీస్ ను తీసుకురానుంది. అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉబర్ కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ పోర్ట్ నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా వీటిని ఉపయోగించొచ్చు. దానికై ప్రత్యేకంగా సిటీలో పలు చోట్ల ఎయిర్ ట్యాక్సీ స్టేషన్లు నిర్మిస్తారు.

మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు

హెలికాప్టర్ అంటే మనం చూసే పెద్ద పెద్ద చాపర్ లు కావు. ట్యాక్సీ సర్వీస్ కోసం ప్రత్యేకంగా మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు తయారు చేస్తున్నారు.

వచ్చే ఏడాది 2026 కల్లా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఉబర్ ప్లాన్ చేస్తుంది. ఈ ఎయిర్ ట్యాక్సీలను జాబీ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీతో ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంంది. అయితే ఉబర్ ఇప్పటికే ఇటలీ, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించింది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్వీసుని పలు నగరాల్లో ప్రారంభించే ప్లాన్ లో ఉంది. ఒకవేళ ఇండియాలో అందుబాటులోకి వస్తే.. బెంగళూరు వంటి నగరాల్లో బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Taxi.. Travel in the air!

You cannot copy content of this page

Scroll to Top