ఆలమూరు: త్రినేత్రం న్యూస్. వేసవికాలంలో నిర్వహిస్తున్న ఉచిత టైక్వాండో,బాక్సింగ్,ఆర్చరీ శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్రాండ్ మాస్టర్ టీ అబ్బులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా క్రీడా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకూ మండల కేంద్రమైన ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్లో రైస్ మిల్లు వద్ద సీనియర్ కోచులతో టైక్వాండో, జూడో, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడల ఉచిత వేసవి శిక్షణా తరగతులు ఉదయం,సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.చిన్నారుల ఆరోగ్యకి శారీరిక ఎదుగుదలకు మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి చిన్నారుల ఆరోగ్యానికి శారీరక ఉల్లాసానికి ఉపయోగపడే ఈ క్రీడలను సద్వినియోగంచేసుకోవాలని ఆయన కోరారు.ఈ శిక్షణనలో పాల్గొనే క్రీడాకారులు 6 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలన్నారు.ఆసక్తి కలిగినవారు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,3 ఆధార్ కార్డు జిరాక్స్ లతో కోచులను సంప్రదించాలన్నారు.ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఉచిత ప్రవేశ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న క్రీడాకారులందరికి ప్రభుత్వం గుర్తింపు పొందిన సర్టిఫికెట్, మెడల్,మెమొంటో లను అందజేస్తారని ఆయన తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


