రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలి.
తహసిల్దార్ అంబటి ఆంజనేయులు.
డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి పి ఎ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ ఆంజనేయులు తనిఖీ చేసి అక్కడి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రైతన్నల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అందించడం శుభ పరిణామం అని ఆయన తెలిపారు.
రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం, వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని ధాన్యం కొనుగోలు కేంద్రం పిఎసిఎస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


