పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బియ్యం నిత్యావసర సరుకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
డిండి (గుండ్లపల్లి) ఆగస్టు 01 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల ను శుక్రవారం రోజు తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, మండల వైద్యాధికారి హరికృష్ణ మరియు వారి సిబ్బందితో కలిసి పరిశీలించడం జరిగింది.
వంటగది ,భోజనాల గది, వస్తువులు నిల్వ చేసే గది, వాష్ ఏరియా పాఠశాలలో అన్ని క్షుణ్ణంగా పరిశీలించి , పరిసరాలను ఎప్పటికీ అప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ శిరీష కు సూచించడం జరిగింది.
అలాగే బియ్యం నాణ్యత మరియు నిత్యవసర సరుకుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఆవరణలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


