సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Suspicious Death

Suspicious Death : అరకులోయ, ఆగస్టు 6, (త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలోని చొంపి బ్రిడ్జి,అరకు రైల్వే స్టేషన్ మధ్య నూతన హైవేపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా భావిస్తున్నారు. అతను తెల్లని హాఫ్ హ్యాండ్స్ షర్టు, తెల్లని బనియన్, నాచు రంగు ప్యాంటు ధరించి ఉండగా, శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. మృతి జరిగి నాలుగు నుంచి ఐదు రోజులయ్యి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page