
arakuvJAC meet ST Commission Chairman : అరకులోయ, ఆగస్టు 6 (త్రినేత్రం న్యూస్): ఆదివాసీ భూముల పరిరక్షణతో పాటు 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్ల బొజ్జిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అరకువేలి గ్రామ పరిధిలో ఆదివాసీ భూములు అక్రమంగా బదిలీ అవుతున్నాయని, వాటిపై నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జేఏసీ ఆరోపించారు. ఎల్‌టీఆర్ చట్టం ప్రకారం అక్రమ భూ బదిలీలపై కేసులు నమోదు చేసి, చట్టవిరుద్ధ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో జేఏసీ మండల కన్వీనర్ సమర్ధి గోపాలరావు, మండల కో-కన్వీనర్లు కీల్లో ఆనంద్, కీల్లో బుద్ధు, మధు, కొములు దేవ, బారిక గాసి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe