TRINETHRAM NEWS

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనన్న న్యాయస్థానం, నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదని వ్యాఖ్య, కేసును కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం

Trinethram News : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని నిరూపించేందుకు నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేస్తూ దీనికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేసింది. 1989లోని సెక్షన్ 3(1)(ఆర్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్టు కానీ, బెదిరించినట్టు కానీ నిరూపించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

తాజా కేసులో ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందని, అది జరిగిన తర్వాత ఫిర్యాదుదారుడి సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడాన్ని న్యాయస్థానం ఎత్తిచూపింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1) (ఎస్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App