జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 11 at 3.35.47 PM

TRINETHRAM NEWS

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను కులమతాల ఆధారంగా విడగొడుతున్న బి‌జే‌పి వైఖరిని ఎండగడుతూ దేశ పౌరులు అందరూ ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ,ప్రజలలో ఏకత్వ భావన పెంపొందించడానికి గత సంవత్సరం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశ ప్రజలలో స్ఫూర్తిని నింపారని తెలిపారు.
నేడు అదే విధంగా దేశ ప్రజలకు సామాజిక న్యాయం అందించడంలో విఫలం చెందిన బి‌జే‌పి సర్కారుకు వ్యతిరేకంగా జనవరి 14వ తేదీ నుండి ప్రారంభం అయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావాలని ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్,131 డివిజన్ అధ్యక్షులు రాధా కృష్ణ,అసెంబ్లీ కో ఆర్డినేటర్ చిరంజీవి శ్రీకర్,వెంకట్ రెడ్డి,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page