జూలై 5, 2026
TRINETHRAM NEWS
Sunny Leone in shock

Sunny Leone : త్రినేత్రం న్యూస్ : బెళగావి శివం అసోసియేట్స్‌ అక్రమంగా కస్టమర్స్ నుంచి పెద్ద మొత్తంలో స్వీకరించిన నగదు డిపాజిట్లతో గత డిసెంబరులో నిర్వహించిన కన్నడ ఉత్సవంలో పాల్గొన్న నటులకు నోటీసులు జారీ చేసేందుకు సీఐడీ సిద్ధమైంది.

నటులు డాలి ధనుంజయ, వశిష్ఠ సింహ, సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అయితే వారికి భారీగా డబ్బు అందినట్లు సీఐడీ అనుమానిస్తూ.. వారిని విచారించనుంది. అలాగే ఆ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర 2023లో తీసిన ఛాంపియన్‌ చిత్రంలో ఐటెం సాంగ్ లో సన్నీ లియోన్ డ్యాన్స్ చేసింది.

ఆమెకు రెమ్యూనరేషన్ కింద రూ.కోటి ఇచ్చినట్లు రికార్డు పత్రాల ద్వారా సీఐడీ తెలుసుకుంది. దీనికి వివరణ ఇవ్వాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page