Students awareness : స్వచ్చతా ప్రమాణాల పట్ల విద్యార్థులు అవగాహన

TRINETHRAM NEWS

నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మానవ హారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే అనారోగ్యాలు దరిచేరవని అన్నారు. చెత్తను రీ సైకిలింగ్ చేయడానికి అనుకూలంగా తడిచెత్త , పొడి చెత్త గా వేరు చేసే పద్దతులను విద్యార్థులకు వివరించి వారితో స్వచ్చ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంజీవ్ , సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , సానిటరీ జవాన్ అశోక్ , ఎకో వారియర్స్ ప్రతినిధులు శివ కృష్ణ , కరుణాకర్, మహేందర్ , కళాశాల అధ్యాపకులు , మెప్మా ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు. కాగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా “ ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ “ నినాదంతో గురువారం ఉదయం గోదావరి పుష్కర ఘాట్ వద్ద శ్రమదానం నిర్వహించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Students aware of cleanliness standards

You cannot copy content of this page

Scroll to Top