
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య
Trinethram News : మహబూబ్నగర్ : ఫిబ్రవరి 06. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఈరోజు ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది, ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో తరగతి గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన తోటి విద్యా ర్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్‌కు వచ్చిన టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధిం చిన వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
