ఐ కృష్ణ. ఐ ఎఫ్ టీ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపై కొనసాగిస్తున్న మారణ హోమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పాలస్తీనా ప్రజా పోరాటానికి సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ. మద్దతు తెలుపుతూ తెలియజేస్తూ అక్టోబర్ 5 నుండి 9 వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలనే పిలుపులో భాగంగా ఈ రోజు గోదావరిఖని లో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సంఘీభావ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ. గత రెండు సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ అమెరికా అండతో పాలస్తీనా జాతి ప్రజలను నిర్మూలించే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు.
గాజాపై దుర్మార్గపు దాడి కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి వల్లించే అమెరికా తమ స్వార్థం కోసం ఇజ్రాయిల్ దేశాన్ని 1948 తర్వాత సృష్టించి, పాలస్తీనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపాలని, ప్రజాస్వామ్య రక్షణకు కృషి చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు ఇజ్రా యిల్ ఆధర్మ దాడిలో 60వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు జీవించే హక్కును హరించే హక్కు అమెరికాకు ఎవడిచ్చాడని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఆదర్శమైన ప్రజాస్వామ్య దేశమంటూ గొంతు చించుకునే అమెరికా
నేడు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకొని, తన మార్కెట్ ఆదిపత్యం కోసం దాడుల్ని కొనసాగిస్తుందని తెలిపారు. పాలస్తీనా ప్రజల ప్రతిఘటన పోరాటం జయప్రదం కావాలని, వారి పోరాటానికి సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సి.పి.ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్,నాయకులు చిలుక శంకర్, ఐ రాజేశం, ఐ ఎఫ్ టీ యు జిల్లా నాయకులు డి రాజేశం, గుండు రాజయ్య ,పెరుక వెంకటస్వామి,దుర్గం పోచయ్య, కారంగుల నారాయణ, కే మల్లేశం, ఆవునూరి రాజు, సల్లూరి నారాయణ, పోడేపల్లి సంతోష్ , ప్రేమ్ కుమార్, లింగయ్య, ఎం వెంకటస్వామి.దితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


