అక్రమ దత్తత చెల్లెదు.
డిండి (గుండ్లపల్లి)అక్టోబర్ 30. త్రినేత్రం న్యూస్. ఐసిడిఎస్ దేవరకొండ ప్రాజెక్టు పరిధిలోని డిండి సెక్టార్ లో అన్ని అంగన్వాడి కేంద్రాలలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాలలో, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, తల్లులకు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. శిశువిక్రయాలు జరిపినట్లైతే కఠిన చర్యలు తీసుకోబడతాయని, అక్రమంగా దత్తత తీసుకుంటే చెల్లదని ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుకా రెడ్డి తెలియజేశారు. ఆడపిల్లల పుట్టుక అవనికి వెలుగని, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, పుట్టిన బిడ్డకు జీవించే హక్కు కలిగి ఉన్నారని, సృష్టికి మూలం ఆడపిల్లలని ,నేటి ఆడపిల్లలే రేపటికి తల్లులని, శిశువిక్రయాలు మరియు అక్రమ దత్తత చేసుకున్నట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయకూడదని, ప్రతి ఆడపిల్లకు చదువుకునే హక్కు కలిగి ఉందని, ఆడపిల్లలకు ప్రభుత్వమే చదువుకోడానికి అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని ఆమె గుర్తు చేశారు .ఆడపిల్లలను రక్షించుకునే హక్కు మన అందరి పైన ఉన్నదని, ఆడపిల్లల హక్కులను పెరుగుదలను సమాజం గుర్తించాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. డిండి మండల కేంద్రంలోని 1 వ అంగన్వాడి కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో అంగన్వాడీ టీచర్ చంద్రకళ మాట్లాడుతూ శిశువిక్రయాలు జరిపినట్లైతే చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని, ఆడపిల్లలను సమాజంలో ఎదగనివ్వాలని, ఆడపిల్ల పుట్టుక అదృష్టమని, సమాజానికి మెసేజ్ ఇవ్వాలని, ఆడపిల్లలే భవిష్యత్తులో అమ్మ లవుతారని ఆమె అన్నారు. డిండి మండల కేంద్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్లు చంద్రకళ, సత్యవాణి, లావణ్య, మంగమ్మ, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


