రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్.
అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి :8
అనంతగిరి మండలం గిరిజన నాయకుడు జేష్ఠ వెంకటరమణపై గిరిజనేతర భూస్వామి బీ.నగేష్ దాడి చేయడం అత్యంత హేమమైన చర్య అని, భూస్వామి బి.నగేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది.
భూస్వామి దాడిలో గాయపడి అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణకు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల నాయకులు కిల్లో జగన్నాథం, కె.సహదేవ్ లతో కలిసి పరామర్శించారు.
జిల్లా ప్రధాన పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్రశ్నించిన గిరిజన నాయకుడుపై దాడి చేసిన వారిపై తక్షణమే అరెస్టు చెయ్యాలని 13 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన విటోరి రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని కబ్జా చేశారని, అనంతగిరి మండలం, భింపోలు పంచాయితీ, సర్యపల్లి రెవిన్యూ పరిదికి చెందిన సర్వే నవంబర్ – 66 లో 13 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని విటోరి రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని జనవరి 3 తేదిన ఆక్రమించి సదును చేస్తుండగా, రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేసినందుకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడి, గిరిజన నాయకులైన జేష్ఠ వెంకటరమణ, ఆర్.శ్రీను పై గుండాలతో రాత్రి దాడి చేసి గాయ పర్చారని, తక్షణమే వెటోరి రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని బి.నగేష్ పై ఏస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.
13 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమించిన గిరిజ నేతర భూస్వామిపై లాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చెయ్యాలని ఆదివాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములను మైదానవాసులు అక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేస్తూ భౌతికంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు రక్షణ లేదని నాన్ షెడ్యూల్ ఏరియని షెడ్యూల్ ప్రాంతంలో కలిపితే ఆదివాసీల భూములు,అడవులు రక్షణ కల్పించాలని గిరిజనులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App