సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Stay alert

Stay Alert : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 24 ; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్కల మాధవరం మాట్లాడుతూ , తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.

అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల సమీపంలోకి వెళ్ళకూడదు అని పేర్కొన్నారు. తెగిపడినటువంటి విద్యుత్ తీగల కు దూరంగా ఉండాలని, పిల్లలను బయటకు పంపకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. సంబంధిత అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని , సురక్షితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page