సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Deputy CM Reviews

Deputy CM Reviews : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; ఈ జిల్లాలో భారీ వర్షాలపై పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

అదేవిధంగా రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని వెల్లడించారు. నీటి నిల్వలు లేకుండా డీ వాటరింగ్ చేయాలని అన్నారు. తక్షణం పంట నష్టం అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆస్తి నష్టం జరిగిన చోట పరిహారం అందించాలని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page