TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: సమస్యలపై,గిరిజన మహిళల ఆర్ధిక వృద్ధి రేటు,వారిలో స్వాలంబన శక్తి పెంపొందింపు, పౌర సరఫరాల సరుకు నిల్వలు వంటి అంశాలపై, పూర్తి స్థాయి దృష్టి పెట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్.
పాడేరు లో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ కి కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా మోదమాంబ అమ్మవారి పాదాలకు చేరుకుని దర్శనానంతరం, మినుములూరు గ్రామంలో డ్వాక్రా మహిళలతో ప్రత్యేకంగా సమావేశం , డి ఆర్ డిపో పరిశీలన చేశారు. జనసేన పార్టీ పాడేరు మరియు అరకు పార్లమెంట్ ఇన్చార్జి డా.గంగులయ్య ఆలోచన మేరకు జనసేన పార్టీ కార్యాలయం లో సుమారు అరగంట పాటు నాయకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.అనుకున్న షెడ్యూల్ పరంగానే ఈ పర్యటన సాగినప్పటికి, జనసైనికులతో పూర్తి సమావేశం ఉంటే బాగుండేదనుకున్నారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందాయి. బహుశా అవి వినతి పత్రాలు అనేకంటే కూడా,పూర్తి గిరిజన ప్రజల సమస్యల చిట్టా అని భావించవచ్చు.అనంతరం పీఎంఆర్సీ భవనంలో అధికారులు బోజన ఏర్పాటు చేశారు.పాత్రికేయులతో గిరిజన సహకార సంస్థ సందర్శన ,కొట్న పల్లి గ్రామంలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఇది రెండు పర్యటన గతంలో కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గా కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించియున్నారు.శాఖాపరమైన సమస్యలు ప్రదానంగా కాకుండా వివిధ రకాల సమస్యలన్నీ వినతి పత్రాలు ,సమస్యలు రావడం ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసే దిశగా ఆలోచన చేయడం సాధారణంగా,సమస్యల తీవ్రతను ఆయన అర్దం చేసుకున్నారనుకోవాలి. సహజంగానే పర్యటన సజావుగానే సాగింది.కూటమి నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు,వివిధ స్థాయి నాయకులు, జనశైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు,తరలి వచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App