Dindi News : డిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది, వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బంది.

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) మార్చి 10 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేక ఇబ్బంది సరిపోను లేక రోగులు మరియు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. తాగునీరు వసతి లేదు. మరుగుదొడ్లు లేవు.
మిషన్ భగీరథ నీళ్లు వారానికి రెండు సార్లు రావడం రోగులకు తాగునీరు సరఫరా లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోరు వేసి దాహార్తి తీర్చాలని రోగులు మండల కేంద్రం పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరుగుదొడ్లు, పేషెంట్ వార్డులు లేకపోవడం గమనార్హం .
ఆవరణ లోపల చుట్టూ చెత్త పేరుకుని ఉండడం పిచ్చి చెట్లు ఆవరణలో నిండి ఉన్నాయి. వాటిని తొలగించే వారే లేరా??
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాల్సింది పోయి, చెత్త కుప్పలతో నిండి ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడు సిబ్బంది లేక రోగులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు. ఆవరణలో వీధి కుక్కలు స్వైరా వికారం చేస్తున్న పట్టించుకోవడం లేదు.
ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారికి కుక్కలు కాటేస్తే వాళ్ళకి బాధ్యత ఎవరు?? వైద్యాధికారుల నిర్లక్ష్యమా?

నల్గొండ జిల్లా కేంద్రానికి చిట్టా చివరన ఉన్నందున ప్రభుత్వం గానీ జిల్లా వైద్యాధికారులు గాని పట్టించుకో వడం లేదని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మందుల, టెస్టుల, ప్రిసిపీక్షన్ స్లీప్ లో కాకుండా చిన్న అట్టముక్కల పై రాసి ఇవ్వడం విడ్డూరం.
ఈ ఆరోగ్య కేంద్రానికి మండలంలోని చుట్టుప్రక్కలక్కల గ్రామాల ప్రజలు వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. వారికి సరైన వసతులు లేక వైద్యాధికారి స్థానికంగా అందుబాటులో ఉండాలి. కానీ వైద్యాధికారి హైదరాబాద్ నుండి డిండి కి వారానికి రెండు సార్లు రావడం, వచ్చిన రోజైనా పూర్తిగా డ్యూటీ చేయకుండా ఉదయం 11 గంటలకు వచ్చి తిరిగి ఇంటికి బయలుదేరడం గమనార్హం.
వచ్చిన రోగులను పట్టించుకునే వారు లేకపోవడం, ఏదైనా అత్యవసర వైద్యం అందించాలంటే సిబ్బంది లేక ఉన్నవాళ్లు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు అచ్చంపేట ఆసుపత్రికి లేదా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకుపోవడం మన ఆయుష్షు ఉంటే బ్రతకడం లేదా చావడం జరుగుతుంది.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రజలకు రోగులకు వైద్యం చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిండి మండల మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరు తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలతో నిండి సమస్యలను పరిష్కరించే సౌకర్యాలు వసతులు మంచినీటి సరఫరా కల్పించాలని కొన్ని ఏళ్ల నుండి ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులకు వేడుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం.

డిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది.
వైద్యాధికారుల పోస్టులు రెండు ఉన్న ప్రస్తుతం ఒక్కరే పని చేస్తుండడం, వారు సమయానికి అందుబాటులో లేకపోవడం విడ్డూరం.
నిత్యం ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సంఖ్యకు అనువైన గదులు టాయిలెట్స్ లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదని సమాచారం.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిండి మండల మరియు చుట్టుపక్క గ్రామాలలోని ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని శాఖా పరమైన అధికారులకు కోరుతున్నారు.
ఈరోజు ఆసుపత్రిని పరిశీలన కోసం విలేకరి వెళ్లగా ఆయుష్ వైద్యురాలు ను ఆస్పత్రి కి సంబంధించిన వివరాలను కోరగా ఆమె మాట్లాడుతూ.
సిబ్బంది కొరత ఉందని వైద్యాధికారులు ఇద్దరికీ పోస్టులు ఉన్న ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు.
దీంతో రోగులకు సకాలంలో సరైన విద్యం అందడం లేదు మండలంలో 22 మంది ఎఎన్ఎంలకు గాను 11 మంది ఉన్నారు 11 మంది ఖాళీగా ఉన్నాయి.

స్టాఫ్ నర్స్ లు ముగ్గురికి ఒక్కరే ఉన్నారు.
సూపర్వైజర్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి.
ఇద్దరు ఫార్మాసిస్టులకు ఒక్కరే ఉన్నారు.
ఆశ నోడల్ అధికారితోపాటు ఇద్దరు వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లావైద్యా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండేటట్లు చూస్తారని డిండి మండల మరియు పరిసర గ్రామాల ప్రజలు వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top