జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 24 at 5.29.27 PM

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీల నాయకుడు పరిటాల రవి— కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : Medchal :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్లో పరిటాల రవి 20వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో వారు ప్రజలకు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు..
అలాగే పేద ప్రజలకు అండగా నిలిచిన ప్రజా నాయకుడు పరిటాల రవి అన్నారు…
వారి సేవలు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో మెదులుతాయి అన్నారు..

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ జెట్టి కుసుం కుమార్, టీపిసీసీ జనరల్ సెక్రటరీ నర్సిరెడ్డి భూపతిరెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజవర్గం ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి, కూకట్ పల్లి నియోజవర్గం ఇంచార్జ్ బండి రమేష్ గార్లతో పాటు బండి శ్రీనివాస్ గౌడ్, పులి సందీప్, మోతి శ్రీనివాస్ యాదవ్, అర్వ వెంకట్, గుమస్తా మధు, ప్రభాకర్ రెడ్డి నిర్వాహకులు నీలపాటి కరుణాకర్ రావు, సుండూరి అనంత చౌదరి, అంతయ్య, శశి, కోటేశ్వరరావు, వంశీ, రమేష్, శివాజీ, పరిటాల రవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page